మనోహరాబాద్ జేపీహెచ్‌ఎస్‌లో ఘనంగా న్యూట్రిషన్ మేళా
మనోహరాబాద్ జేపీహెచ్‌ఎస్‌లో ఘనంగా న్యూట్రిషన్ మేళా మనోహరాబాద్, సెప్టెంబర్ 19: మనోహరాబాద్ మండల కేంద్రంలోని జేపీహెచ్‌ఎస్‌లో శుక్రవారం పేరెంట్–టీచర్ మీటింగ్ సందర్భంగా న్యూట్రిషన్ మేళాను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు న్యూట్రిషన్ మేళాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఇళ్లలో తయారు చేసుకునే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో పాటు వివిధ రకాల పోషక విలువలు కలిగిన వంటకాలను...