prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 1:37 pm Digital Edition : PRAJA VANI

మధిర 100 పడకల ఆసుపత్రిలో లీకేజ్…

*మధిర 100 పడకల ఆసుపత్రిలో లీకేజ్…!

*సెకండ్ ఫ్లోర్ వర్షపు నీటితో లీక్ అవుతున్న వంద పడకల ఆసుపత్రి…?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా మధిర లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిలో అన్ని లీకేజీలే.. ఈ లీకేజీల వల్ల అక్కడికి వచ్చిన పేషెంట్లు అవస్థ పడుతున్నారు. నూతనంగా నిర్మించిన వంద పడకల ఆస్పత్రి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రెండోవ అంతస్తు మొత్తం వర్షపు నీటితో లీకేజ్ అవుతుంది. పట్టమని మూడు సంవత్సరాలు కాకముందే ఇలా లీకేజ్ అవడంతో కాంట్రాక్టర్ ఎంత నాణ్యత నిర్మించాడో అర్థమవుతుందని పలువురు రోగులు మధిర పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పేరుకే అభివృద్ధి నిర్మాణ పనులు.. అన్ని నాణ్యత లోపంతోనే నిర్మించబడుతున్నాయనే ఆరోపణలు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్నప్పటికీ సంబంధిత క్వాలిటీ కంట్రోల్ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం నాణ్యతా ప్రమాణాలు లేని నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయనే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ప్రభుత్వంలోనైనా నాణ్యమైన నిర్మాణాలను చేపట్టాలని మధిర ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోలింగ్ శాఖ విజిలెన్స్ శాఖలు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు కలిగిన నిర్మాణాలు జరిగే విధంగా కృషి చేయాలని నాసిరకం నిర్మాణాలతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయఅనే ఆరోపణలకి శాశ్వతంగా చెక్ పెట్టాలని పలువురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.