prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 3:58 pm Digital Edition : MAHESH MEDCHAL

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష.. మరో నాలుగు కేసుల్లో రూ.4 వేల జరిమానా

మేడ్చల్, సెప్టెంబర్ 29: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఏడు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను మంగళవారం మేడ్చల్ గౌరవ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కమ్ VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం పరిష్కరించింది.

వీటిలో మూడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా, ఇద్దరికి జైలు శిక్ష విధించారు. ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినందుకు నమోదైన నాలుగు కేసుల్లో మొత్తం రూ.4,000 జరిమానా విధించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు.