prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:06 pm Digital Edition : PRAJA VANI

మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్ ఎస్ ఎస్ దినోత్సవ వేడుకలు

మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్ ఎస్ ఎస్ దినోత్సవ వేడుకలు

మద్దూరు సెప్టెంబర్ 24, ప్రజా వాణి,

మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఎన్ఎస్ఎస్ చైర్మన్ & ప్రిన్సిపల్ కొలను శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ సేవ పథకం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ . ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ను 1969 సెప్టెంబర్ 24 వ తారీఖున ఆనాటి కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్:వి.కే .ఆర్.వి.రావు సూచన మేరకు ఎస్.రాధా కృష్ణ నేతృత్వంలో యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ప్రతినిధుల సమావేశంలో ఎన్ఎస్ఎస్ ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలో మొట్టమొదటి ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కే.గుప్తా ,మరియు ఎన్ ఎస్ ఎస్ పితామహునిగా డాక్టర్ వి కే ఆర్ వి రావును పిలుస్తారు.

ఎన్ ఎస్ ఎస్ చిహ్నం ;

ఎన్ ఎస్ ఎస్ చిహ్నంను ఒడిస్సా లోని ప్రపంచ ప్రఖ్యాతిగా రాసిన కోణార్క సూర్య దేవాలయంలోని పెద్ద రథచక్రం ను చిహ్నంగా తీసుకోవడం జరిగింది ఈ చక్రంలో 8 గీతలు 24 గంటల సమయానికి సూచిక ఈ చిహ్నం లోని ఎరుపు రంగు యువత యొక్క రక్తమునకు సాదృశ్యము నేవీ బ్లూ మానవజాతి సహకార సంక్షేమాలను సూచిస్తుందన్నారు. ఎన్ ఎస్ ఎస్ నినాదం(నాకోసం కాదు- మీకోసం) అనే నినాదంతో పని చేస్తుందన్నారు

ఎన్ ఎస్ ఎస్ లక్ష్యం;

విద్యార్థులలో సామాజిక సంక్షేమం అనే ఆలోచనను పెంపొందించడం, నిష్పక్షపాతంగా సామాజిక సేవ లో పాల్గొనడం విపత్తు బాధితులకు సేవలు అందించడం,పర్యావరణ అభివృద్ధికి తోడ్పడటం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం,గ్రామీణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావటం,పర్యావరణ అభివృద్ధికి కృషి చేయడం,మూఢనమ్మకాల పైన సామాజిక స్పృహను కల్పించటం అనేది, ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యాలుగా కార్యకలాపాలుగా పేర్కొన్నారు. ఈ 50 వసంతా లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం కూడా సామాజిక సేవలో పాల్గొని దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.