మతాలు వేరైనా.. మానవత్వం ఒకటే.. అన్నదానంతో ఐక్యత బాటలు
మతాలు వేరైనా.. మానవత్వం ఒకటే.. అన్నదానంతో ఐక్యత బాటలు పోత్కపల్లి లో కులమతాలకు అతీతంగా అన్నప్రసాదం.. మానవత్వమే మహోన్నతమని చాటిన అంబేద్కర్ యూత్ ఓదెల, సెప్టెంబర్ 20: కులమతాలకు అతీతంగా మానవత్వమే ప్రధానమనే సందేశాన్ని చాటుతూ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, సేవా దృక్పథాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి షరీఫ్ రూ.5,000 విరాళంగా అందించగా, పాల వెంకటేష్ కూరగాయలను అందించి...