prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 8:28 pm Digital Edition : PRAJA VANI

మతాలు వేరైనా.. మానవత్వం ఒకటే.. అన్నదానంతో ఐక్యత బాటలు

మతాలు వేరైనా.. మానవత్వం ఒకటే.. అన్నదానంతో ఐక్యత బాటలు

పోత్కపల్లి లో కులమతాలకు అతీతంగా అన్నప్రసాదం..

మానవత్వమే మహోన్నతమని చాటిన అంబేద్కర్ యూత్

ఓదెల, సెప్టెంబర్ 20: కులమతాలకు అతీతంగా మానవత్వమే ప్రధానమనే సందేశాన్ని చాటుతూ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
సమాజంలో ఐక్యత, సోదరభావం, సేవా దృక్పథాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి షరీఫ్ రూ.5,000 విరాళంగా అందించగా, పాల వెంకటేష్ కూరగాయలను అందించి తన వంతు సహకారం అందించారు. అలాగే సభ్యులు శనిగారపు రాంచందర్, శనిగారపు నర్సయ్య, కొర్రి కుమార్ తదితరులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అన్నదానం వంటి కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు సోదరభావాన్ని చాటిచెప్పేందుకు దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమానికి సహకరించిన దాతలు, కమిటీ సభ్యులు, యువతకు అంబేద్కర్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.