మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: బద్వేల్‌లో బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టి గణపతుల పంపిణీ
బద్వేల్, సెప్టెంబర్ 13: ప్రజావాణి పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణే ధ్యేయంగా బద్వేల్ పట్టణంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బొమ్మన సుబ్బరాయుడు అన్న మార్గదర్శకత్వంలో స్థానిక అన్న క్యాంటీన్ వద్ద శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పండుగను ప్రకృతికి హాని చేయకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బద్వేల్ ఏఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు లక్ష్మణ్ జీ, కడప...