మట్టి గణపతి.. ప్రకృతికి ప్రాణవాయువు
*మట్టి గణపతి.. ప్రకృతికి ప్రాణవాయువు* పర్యావరణహిత వినాయక ఉత్సవాలకు ప్రజలు మొగ్గు చూపాలి మేడ్చల్: వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. పీఓపీ విగ్రహాలు, రసాయన రంగుల వినియోగం వల్ల నిమజ్జనం అనంతరం నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సహజ మట్టితో తయారైన విగ్రహాలను పూజించి, పర్యావరణహిత పద్ధతుల్లో నిమజ్జనం నిర్వహించడం ద్వారా పండుగ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ప్రకృతిని కాపాడుకోవచ్చని వారు పేర్కొంటున్నారు....