prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 5:46 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మట్టిలో మాణిక్యం ఆయేషా, ఎంబీబీఎస్ సీటు సాధించిన రైతు బిడ్డ

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అంకుష్-అజిజ దంపతుల కుమార్తె మహమ్మద్ ఆయేషా జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయేషా పట్టుదలతో చదివి నీట్ ఉత్తీర్ణత సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు చెన్న కుమారస్వామి ఆమెను ఘనంగా సన్మానించారు. గ్రామీణ విద్యార్థులకు ఆయేషా స్ఫూర్తిగా నిలిచిందని, భవిష్యత్తులో పేదలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.