prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 3:50 pm Digital Edition : PRAJA VANI

మక్తగూడెంలో మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

*మక్తగూడెంలో మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సాయ*

 

 

మక్తగూడెం, సెప్టెంబర్ 08: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

 

 

మక్తగూడెం గ్రామానికి చెందిన కొడూరి మల్లయ్య అకాల మరణం పట్ల గ్రామ సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ తరఫున ₹5,000 ఆర్థిక సహాయాన్ని 10వ వార్డు మెంబర్ విష్ణు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వొగ్గు దేవయ్యతో పాటు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొని మల్లయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని వారు ప్రార్థించారు.