prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:42 pm Digital Edition : PRAJA VANI

మక్తగూడలో రూ.65 వేల లడ్డూ వేలం

మక్తగూడలో రూ.65 వేల లడ్డూ వేలం

లడ్డూను కైవసం చేసుకున్న గోవుల రామచంద్రయ్య

రంగారెడ్డి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 25, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని మక్తగూడ గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడికి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గురువారం రాత్రి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని బీచుపల్లి వద్ద నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బచ్చన్నగారి పెద్దొల్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

నిమజ్జన కార్యక్రమం అనంతరం నిర్వహించిన వినాయక లడ్డూ వేలంపాటలో మక్తగూడ గ్రామానికి చెందిన గోవుల రామచంద్రయ్య రూ.65,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.

ఈ వేలంపాట కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక అసోసియేషన్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రాల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పత్తి రవికుమార్, కమిటీ సభ్యులు డిపి ప్రభాకర్ రెడ్డి, బిపి శ్రీధర్ రెడ్డి, పత్తి శంకర్, గోవుల శ్రీశైలం, దండగుల శేఖర్, పత్తి ప్రవీణ్ కుమార్, సోలిపేట రాఘవేందర్ గౌడ్, శివానంద్, కే. మల్లేష్ గౌడ్, పత్తి నిరంజన్, మురంగుల అభి, దండగుల యాదయ్యతో పాటు అసోసియేషన్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.