prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:24 pm Digital Edition : ELKATHURTHI

మండల స్థాయి క్రీడా ఎంపికలకు సర్వం సిద్ధం

మండల స్థాయి క్రీడా ఎంపికలకు సర్వం సిద్ధం

ఎంఈఓ చదువుల సత్యనారాయణ

పీడీ ఎం.ధనలక్ష్మి

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపికలకు సర్వం సిద్ధమైంది.సెప్టెంబర్‌ 9న కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఈ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ అధ్యక్షుడు,ఎంఈఓ చదువుల సత్యనారాయణ తెలిపారు.
కబడ్డీ,వాలీబాల్,ఖో-ఖో క్రీడల్లో అండర్‌–14,అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించనున్నారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొననున్నారు.
క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు,పిన్ నెంబర్ వివరాలను వెంట తీసుకురావాలని,ఎంపికలకు ఉదయం 9 గంటలకు కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో హాజరు కావాలని అధికారులు సూచించారు.క్రీడాకారులు సమయపాలనతో హాజరై తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు.
విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి,వారిని ఉన్నత స్థాయి పోటీలకు తీర్చిదిద్దడమే ఎస్‌జీఎఫ్ లక్ష్యమని తెలిపారు. మండలస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాలల పీడీలు,ఉపాధ్యాయులు సహకరించాలని ఎస్‌జీఎఫ్ కార్యదర్శి,పీడీ ఎం. ధనలక్ష్మి కోరారు.