మండల ఉత్తమ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం
మండల ఉత్తమ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం ఎండీ యాకూబీని అభినందించిన ఎంఈఓ ఎం. బుచ్చయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తొర్రూర్ మండలంలోని మడూరు జయంతి కాలనీకి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎండీ యాకూబీ మండల ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని టీచర్స్ యూనియన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం. బుచ్చయ్య పాల్గొని ఎండీ యాకూబీని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు...