మండపంలోనే మట్టి వినాయకుడి నిమజ్జనం

*మండపంలోనే మట్టి వినాయకుడి నిమజ్జనం* * *మన ప్రజావాణి* మందమర్రి:- శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో పట్టణ మార్కెట్ వ్యాపారస్తులు ప్రతిష్టించిన మట్టి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వాహకులు బుధవారం మండపం వద్దనే భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు హాజరై, గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఓదెలు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి, పూజించడం ఎంతో అవసరమని తెలిపారు....