మంచాల శ్రీ చండీశ్వర గణేష్ ఉత్సవ కమిటీ
*మంచాల శ్రీ చండీశ్వర గణేష్ ఉత్సవ కమిటీ,* *కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం* మంచాల, సెప్టెంబర్ 20: రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని మంచాల గ్రామంలో శ్రీ చండీశ్వర గణేష్ ఉత్సవ కమిటీ, కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అన్నప్రసాద దాతలు శ్రీ కొనల వసంత–శ్రీశైలం కురుమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాథుడి దర్శనానికి వచ్చిన భక్తులు, గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని...