మంచాల గ్రామంలో పడకేసిన పరిశుభ్రత
*మంచాల గ్రామంలో పడకేసిన పరిశుభ్రత* •• *పంచాయతీ అధికారులు పట్టించుకోని వైనం.* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ప్రజావాణి సెప్టెంబర్ 18: మంచాల గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో పాటు పలు వార్డుల్లో గడ్డి విపరీతంగా పెరిగిపోయి దోమల బెడద ఎక్కువైందని చెబుతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో ఊరి చివరలో రోడ్డుకు...