మంచాలలో విద్యుత్ సమస్యలపై రైతుల ఆందోళన
*మంచాలలో విద్యుత్ సమస్యలపై రైతుల ఆందోళన* *పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు.. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మండలం. మంచాల. , సెప్టెంబర్ 22 (ప్రజావాణి): మంచాల మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు సకాలంలో సాగునీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ అంతరాయాలు తీవ్ర...