prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 12:04 pm Digital Edition : PRAJA VANI

మంగళవారం నుండి లద్నూరు విద్యార్థులకు జనగామకు బస్సు సౌకర్యం

మంగళవారం నుండి లద్నూరు విద్యార్థులకు జనగామకు బస్సు సౌకర్యం

జనగామ బస్సు డిపో మేనేజర్ ఏం. ఉషా

బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన మాజీ సర్పంచ్ రామడుగు బాల్ రాజ్,

మద్దూరు సెప్టెంబర్ 14, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థిని విద్యార్థులకు నేరుగా జనగామకు బస్సు సౌకర్యం కల్పించాలని గత నాలుగు రోజుల క్రితం రెండు గంటల పాటు రోడ్డు బైఠాయించి విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేయడంతో జనగామ డిపో మేనేజర్ ఏం.ఉషా స్పందించి మంగళవారం నుండి కల్పించనున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామడుగు బాల్ రాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ నేరుగా జనగామకు వెళ్లి డిపో మేనేజర్ ను కలిసి బస్సు సౌకర్యం తక్షణమే కల్పించాలని కోరడంతో మంగళవారం నుండి విద్యార్థులకు 8:30 నిమిషాలకు బస్సు సౌకర్యం జనగామకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.