భూకబ్జాదారుల ఆక్రమణల్లోని 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, పేదలకు పంచాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
కాశినాయన సెప్టెంబర్ 19 ప్రజావాణి రాజకీయ పలుకుబడితో భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకుని, భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుల దౌర్జన్య పూరిత ఆక్రమణలకు వ్యతిరేకంగా శనివారం ఉదయం కాశినాయన మండల పరిధిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉధృత భూపోరాటం నిర్వహించారు. నాయనపల్లె, వరి కుంట్ల గ్రామాలకు చెందిన వందలాది మంది పేదలు, వ్యవసాయ కార్మికులు ఎర్రజెండాలు చేతబూని...