భూకబ్జాదారులు నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం : ఆర్డీఓ చంద్రమోహన్ హెచ్చరక
బద్వేల్:వైఎస్ఆర్ కడప జిల్లా సెప్టెంబర్ 26ప్రజావాణి కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లె రెవెన్యూ పరిధిలో దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేల్ రెవెన్యూ అధికారి ఆర్డీఓ చంద్రమోహన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. వివాదాస్పద భూములకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న 8 ఎకరాల భూమిని మినహాయించి, మిగిలిన అన్ని ప్రభుత్వ భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. శనివారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి...