*భువనగిరిలో గరుడ వస్త్ర సిల్క్స్ షోరూమ్ ప్రారంభోత్సవం…*
*కుటుంబ సమేతంగా షాపింగ్‌కు విచ్చేసి ఎందుకు సరికొత్త వేదిక..*
*ముఖ్య అతిథిగా సినీ నటి మీనాక్షి చౌదరి.**
*యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 22 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గరుడ వస్త్ర సిల్క్స్ నూతన షోరూమ్ సోమవారం రోజు ఘనంగా ప్రారంభమైంది. భువనగిరి మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం పక్కన ఏర్పాటు చేసిన “గరుడ వస్త్ర సిల్క్స్–ఫ్యామిలీ షాపింగ్ మాల్” ను ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన తరువాత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతి నిధులు , ప్రముఖులు , ఫ్యాషన్ ప్రియులు , వ్యాపార వేత్తలు , స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని షాపింగ్ చేశారు.
జక్కా రఘునందన్ రెడ్డి, అనంత్ రెడ్డి , జక్కా శ్యామంతక మణి , జక్కా మానీషా , జక్కా శ్రేయ ఆధ్వర్యంలో షోరూమ్ ప్రారంభోత్సవ కార్య క్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయ , ఆధునిక దుస్తులతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభిరుచులకు అనుగుణంగా విభిన్నమైన ఫ్యాషన్ కలెక్షన్లతో నూతన హంగులతో ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపింది. గరుడుడి స్ఫూర్తితో..హిందూ పురాణాల్లోని గరుడుడి కథ నుంచి బ్రాండ్ తత్వానికి స్ఫూర్తి పొందినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ షాపింగ్ మాల్ను మొదటగా మహబూబ్నగర్ జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలో ప్రారంభించుకొన్న అనంతరం తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు అతి సమీపం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృతం కోసం గరుడు చేసిన పోరాటం , ఆయన కు ప్రతీకలుగా భావించే బలం , భక్తి , కరుణ , నిస్వార్థ ప్రేమ వంటి విలువలను తమ సంస్థ లోనూ ప్రతిబింబించేలా ముందుకు సాగుతున్నట్లు వివరించింది. కుటుంబాల్లో ప్రేమ , ఐక్యత , అనుబంధాలను మరింత బలోపేతం చేసే విలువలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది.
అన్ని వర్గాల వారికి విస్తృత కలెక్షన్లు
షోరూమ్‌లో వివిధ సందర్భాలకు అను గుణంగా చీరలు , సంప్రదాయ దుస్తులు , ఆధునిక వస్త్రాలు , కుటుంబ సభ్యుల కోసం విభిన్న ఫ్యాషన్ కలెక్షన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నాణ్యత , అందం , వైవిధ్యం , తాజా ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఒకే వేదికపై అందించేలా షోరూమ్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా గరుడ వస్త్ర సిల్క్స్‌కు చెందిన జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి నూతన షోరూమ్‌ను సందర్శించి ప్రత్యేక కలెక్షన్లతో పాటు ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసు కోవాలని కోరారు.
కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు , స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీనివాణి , వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల , జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ ఢఅవలిస్ ఉర్ రహ్మాన్ చిష్టీ , మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ , కౌన్సిలర్లు నకోటి నాగేష్ , జలిగం విఘ్నేష్ , పిఎసిఎస్ చైర్మన్ పకీరు కొండల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు , ఆకర్షణీయమైన లాంచ్ ప్రమోషన్లను అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. భువనగిరి ప్రజలకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసేందుకు నూతన అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది.