prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:24 am Digital Edition : PRAJA VANI

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

* లోతట్టు ప్రాంతాలపై ఉభయ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
* కలెక్టర్లకు ఫోన్ చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

అల్పపీడనం ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. ఈ మేరకు గురువారం ఉభయ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు.లోతట్టు ప్రాంతాలు,వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.