భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం
భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం పాల నురగలా జాలువారుతున్న జలధారలు.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న తెలంగాణ నయాగరా వాజేడు, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. సుమారు 50 మీటర్ల ఎత్తు నుంచి పాల నురగలా జాలువారుతున్న జలధారలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతం ప్రకృతి అందాలతో కనువిందు...