భారీ వర్షంలోనూ పండుగ సందడి.. వ్యాపారమే జీవనాధారం
భారీ వర్షంలోనూ పండుగ సందడి.. వ్యాపారమే జీవనాధారం! కూకట్‌పల్లి విలేజ్, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): భారీ వర్షం కురుస్తున్నా పండుగ సందడి మాత్రం తగ్గలేదు. కూకట్‌పల్లి విలేజ్‌లోని బాలాజీ టీ స్టాల్ నిర్వాహకుడు వినాయక చవితి సందర్భంగా తన టీ దుకాణాన్ని మామిడాకులతో అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ పండుగను ఆనందంగా జరుపుకుంటూనే జీవనోపాధిని కొనసాగిస్తున్న వ్యాపారి పలువురి దృష్టిని ఆకర్షించారు. పండుగైనా, వర్షమైనా.. కుటుంబ పోషణ కోసం వ్యాపారమే ఆధారమంటూ చిరునవ్వుతో ముందుకు సాగుతున్న...