భాగ్యనగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనలు
*భాగ్యనగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనలు* జిల్లా న్యూస్ (22 సెప్టెంబర్ 2026) ప్రజావాణి దినపత్రిక ఎనిమిది రోజుల పాటు భక్తులచే భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరిన సందర్భంగా మల్కాజిగిరి సఫిల్ గూడా లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా గంగాధరి మణికంఠ, మద్దెల నిఖిల్ లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో భక్తిభావం, ఉత్సాహం నెలకొంది.