భయపడొద్దు మీ పోరాటానికి నేను అండగా ఉంటా
దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి.
ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో. 12
స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ ముందుకు సాగాలని దర్శి ఎమ్మెల్యే,ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు దర్శి లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జరిగిన విస్తృ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.ఎన్ని కేసులు పెట్టుకున్న ఎవరు వైఎస్ఆర్సిపి శ్రేణులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని సమావేశంలో మాట్లాడారు.అందరూ కలిసి కలిసికట్టుగా పోరాడి వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవాసం చేసుకుందామని అన్నారు. కార్యకర్తల పోరాటంలో తాను అందంగా ఉంటానని స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీ తరపున ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు తెలియపరిచారు. ప్రతి ఒక్క గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ పరిశీలకులు మాజీ పి డి సి సి బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య 5 మండలాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్స్ వైఎస్ఆర్సిపి శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
