భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు

భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు. ఏడవ రోజు నిమజ్జనం సందర్భంగా కృష్ణ తండా లో ఘనంగా శోభాయాత్ర. హుజూర్నగర్ సెప్టెంబర్ 21 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని కృష్ణ తండా లో ఏడవ రోజు గణేష్ నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ప్రతిష్ఠించిన గణనాథుడికి ఉదయం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, గణపతి నామస్మరణల మధ్య సాగిన శోభాయాత్రలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....