prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 2:57 pm Digital Edition : PRAJA VANI

భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు

భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు.

ఏడవ రోజు నిమజ్జనం సందర్భంగా కృష్ణ తండా లో ఘనంగా శోభాయాత్ర.

హుజూర్నగర్ సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని కృష్ణ తండా లో ఏడవ రోజు గణేష్ నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ప్రతిష్ఠించిన గణనాథుడికి ఉదయం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు.
డప్పు వాయిద్యాలు, గణపతి నామస్మరణల మధ్య సాగిన శోభాయాత్రలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘‘గణపతి బప్పా మోరియా’’ నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. నిమజ్జన వేడుకల సమయంలో భక్తులు మరింత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. యువకులు నృత్యాలతో సందడి చేయగా, మహిళలు మంగళహారతులతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగిన అనంతరం సంప్రదాయ పద్ధతిలో గణేష్ విగ్రహాన్ని మట్టపల్లి లోని కృష్ణమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. వినాయక లడ్డూ వేలంపాటలో గ్రామానికి చెందిన నారాయణ, లక్ష్మ, చంద్రశేఖర్ లు కలిసి రూ.10,000 లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు రమాదేవి శంకర్ నాయక్, ఉప సర్పంచ్ పానుగోతు సాంబయ్య,
మేనేజ్మెంట్ 4వ వార్డు మెంబర్ భూక్యా నారాయణ నాయక్,
మాలోతు లక్ష్మణ్ ఎలక్ట్రిషన్ కృష్ణ తండా, కృష్ణ తండా గ్రామ పెద్దలు మరియు ప్రజా ప్రతినిధులు, తండా నాయక్, కార్బరీ అందరూ పాల్గొని నిమజ్జన వేడుకలను విజయవంతం చేశారు.