*బ్యాంక్ కాలనీకి ‘స్వాగత ద్వారం’.. కాట దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరణ!
*సొంత నిధులతో కమాన్ ఏర్పాటు చేసిన శశిధర్‌రెడ్డి..
*అభినందనలు తెలిపిన కాట దంపతులు
బీరంగూడ, సెప్టెంబర్ 22 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో నూతన కమాన్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిధర్‌రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన కాలనీ కమాన్‌ను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్‌గౌడ్ దంపతులు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాట సుధాశ్రీనివాస్ మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ సొంత నిధులతో కమాన్‌ను నిర్మించిన శశిధర్‌రెడ్డిని అభినందించారు
. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.