*బొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. అవిలయ్య*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్, జనగామ మున్సిపాలిటీ 30వ వార్డు మాజీ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ తల్లి ఇటీవల మృతి చెందారు.
తల్లిని కోల్పోయి బాధలో ఉన్న శ్రీనివాస్ ని, వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. అవిలయ్య పరామర్శించారు.
ఈ సందర్భంగా కీ.శే. బొట్ల చిలకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది చింతల సాయిబాబా, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జనగామ జిల్లా ఇంచార్జ్ & యాదాద్రి జోన్ కోఆర్డినేటర్ జేరిపోతుల ఉపేందర్, జర్నలిస్ట్ గంగాధరి శ్రవణ్ కుమార్, కల్లెపు అడివయ్య తదితరులు పాల్గొన్నారు.