బైరాన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం
మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి,
మండలంలోని బైరాన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ధూల్మిట్ట మండల విద్యాధికారి ఏ.కరుణాకర్ రెడ్డి ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభం చేశారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యాధికారి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ప్రీ ప్రైమరీ పాఠశాలలు తోడ్పడతాయనిఅన్నారు.గ్రామస్థులు ప్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు
.ఈకార్యక్రమంలో బైరాన్ పల్లి సర్పంచ్ బర్మ రాజమల్లయ్య యాప్ చైర్మన్ రజిత, ఉన్నత పాఠశాల బైరాన్ పల్లి ప్రధానోపాధ్యాయులు మహేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు,ఉపాధ్యాయులు వివేక్, సురేష్, ప్రీ ప్రైమరీ టీచర్ భవాని,ఆయా నవ్య మరియు పిల్లల తల్లి దండ్రులు,కనకరాజు పాల్గొన్నారు.