prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:19 pm Digital Edition : PRAJA VANI

బెజ్జంకి మండల ప్యాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను కలిసిన బెజ్జంకి మండల ఏకలవ్య యూత్ సంఘం నాయకులు

బెజ్జంకి మండల ప్యాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను కలిసిన

బెజ్జంకి మండల ఏకలవ్య యూత్ సంఘం నాయకులు

బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నూతనంగా ఏర్పాటైన ఏకలవ్య యూత్ సంఘం నాయకులు మంగళవారం మండల పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన కమిటీకి ఒగ్గు దామోదర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత సమస్యలపై పనిచేస్తూ,సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, మండల టౌన్ ప్రెసిడెంట్ కత్తి రమేష్,బోనగిరి శ్రీనివాస్, ఏకలవ్య యూత్ సంఘం బెజ్జంకి మండల అధ్యక్షులు బండి సంపత్,ఉపాధ్యక్షులు కోనేటి తిరుపతి,ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీనివాస్, కోశాధికారి బండి రాజేశం, రైటర్‌గా కోనేటి శ్రీకాంత్, ప్రచార కార్యదర్శిగా బండి సంపత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి కట్ట రాజమౌళి,సభ్యులు భునాద్రి మహేందర్, బండి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.