prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 4:14 pm Digital Edition : PRAJA VANI

బెజ్జంకి క్రిస్టల్ పత్తి క్షేత్ర ప్రదర్శనకు విశేష స్పందన

బెజ్జంకి క్రిస్టల్ పత్తి క్షేత్ర ప్రదర్శనకు విశేష స్పందన

ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

బెజ్జంకి,సెప్టెంబర్ 16 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బుధవారం క్రిస్టల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదానంద్ పత్తి పంట క్షేత్ర ప్రదర్శనకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది.
పత్తిలో అధిక దిగుబడులు సాధించే ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, చీడపీడల నివారణ, పంట సంరక్షణ చర్యలపై సంస్థ ప్రతినిధులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ఈ సందర్భంగా రైతు గుంటి రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్రిస్టల్ సంస్థ ప్రతినిధులు దురుగంటి మనోహర్ రెడ్డి, శ్రీకాంత్, డిస్ట్రిబ్యూటర్ సాయి రామ ఫర్టిలైజర్స్, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.