prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 4:00 pm Digital Edition : PRAJA VANI

బెజ్జంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

బెజ్జంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

రజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు

బెజ్జంకి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి)

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల రజక సంఘ నాయకులు, కుల బాంధవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యయ్యి,చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్ బొల్లం శ్రీధర్, పాలకవర్గ సభ్యులు పాల్గొని ఐలమ్మ పోరాటాన్ని స్మరించుకున్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రజక కుల బాంధవులంతా ఐక్యంగా కృషి చేయాలని దీటి రాజు పిలుపునిచ్చారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రజక సోదరులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,బీజేపీ సంగ రవి, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.