బీజేపీ మండల అధ్యక్షుడిని ముందస్తు అరెస్టు
బీజేపీ మండల అధ్యక్షుడిని ముందస్తు అరెస్టు చిన్నంబావి, ప్రజావాణి సెప్టెంబర్ 22 జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు వస్తున్న నేపథ్యంలో చిన్నంబావి మండల బీజేపీ అధ్యక్షుడు బొగ్గు కురుమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను కురుమయ్య తీవ్రంగా ఖండించారు. జూరాల కింద పంటలకు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని, కర్ణాటక నుంచి నీటిని తీసుకురావడంలోను నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతు సమస్యలను పరిశీలించేందుకు వెళ్లే నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమన్నారు. అరెస్టు...