prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:41 am Digital Edition : PRAJA VANI

బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు మహిళా మంత్రులను అవమానించిన సీఎం వెంటనే రాజీనామా చేయాలి

*బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు*
*మహిళా మంత్రులను అవమానించిన సీఎం వెంటనే రాజీనామా చేయాలి*

:  *మాజీ ZPTC రామకృష్ణ*

షాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 07 : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడాన్ని కొండుర్గ్ మాజీ ZPTC రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టులతో అణచివేయాలని చూడటం సరికాదని రామకృష్ణ అన్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ వైఫల్యాలను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అరెస్టులతో బీఆర్‌ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నవీన్‌రెడ్డి పోరాటం స్ఫూర్తిదాయకం
షాద్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటం తమకు ఆదర్శంగా నిలుస్తోందని రామకృష్ణ అన్నారు. ప్రజల తరఫున ధైర్యంగా ప్రశ్నిస్తూ, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఆయన స్ఫూర్తితో తాము కూడా ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామని తెలిపారు.
మహిళా మంత్రుల పట్ల అవమానకర వైఖరి సరికాదు
మహిళా మంత్రులను అవమానించే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆరోపించిన రామకృష్ణ, ఈ ఘటనపై సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉందని, మహిళా మంత్రులకే అవమానం జరిగే పరిస్థితి రావడం రాష్ట్రానికి అవమానకరమని అన్నారు.
“మహిళలను గౌరవించలేని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కును కోల్పోయారు. మహిళా మంత్రులను అవమానించినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పడంతో పాటు వెంటనే రాజీనామా చేయాలి” అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ నాయకుల అరెస్టులు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కొండుర్గ్ మాజీ ZPTC రామకృష్ణ తెలిపారు.