బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్
ప్రజావాణి,నంగునూరు,సెప్టెంబర్ 07 : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నంగునూరు మండల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని తాతా మధు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఏఎంసీ వైస్ చైర్మన్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అనుచిత భాష ఉపయోగించడం సరికాదన్నారు. సభాపతిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య...