బీఆర్ఎస్‌లో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలి

బీఆర్ఎస్‌లో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలి కేటీఆర్‌కు గిద్దె రాజేష్ విజ్ఞప్తి వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చిలుకూరు: బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేసి, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తెలిపారు. శనివారం చిలుకూరు మండలం రామాపురంలో మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ...