prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:14 am Digital Edition : PRAJA VANI

బీం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

బీం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ

ముఖ్య అతిథులుగా సీఐ ఏ. మహేందర్, 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, యువత

హసన్‌పర్తి, మన ప్రజావాణి:21
బీం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ ఏ. మహేందర్ హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అలాగే 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్ పాల్గొని అన్నదాన కార్యక్రమంలో సేవలందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదానం ద్వారా భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు.

మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

బీం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తున్న సీఐ ఏ. మహేందర్, 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్.