prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 4:27 pm Digital Edition : PRAJA VANI

బి. జె. పి ఆధ్వర్యంలో సేవా సిబ్బందికి సత్కారం

బి. జె. పి ఆధ్వర్యంలో సేవా సిబ్బందికి సత్కారం
అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 30, ప్రజావాణి:
గ్రామీణ ప్రజల ఆరోగ్యం, మహిళలు–చిన్నారుల సంక్షేమం కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనా ప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా కురవి మండలం నల్లేల గ్రామంలో ‘అంగన్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు శేషగాని సరిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గద్దల సరోజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సరోజిని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తల కృషి ఎంతో కీలకమన్నారు. వారి సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమన్నారు.
జిల్లా బీజేపీ అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల భవ్యశ్రీ మహిళలు, బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను గౌరవించడం మంచి సంప్రదాయమన్నారు.
మండల బీజేపీ అధ్యక్షుడు కిషన్ నాయక్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావడంతో పాటు సమాజానికి సేవ చేస్తున్న వారిని గుర్తించి సత్కరించడం కార్యకర్తల బాధ్యత అన్నారు.
కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శులు జిన్నె క్రిష్ణ, కోనతం వెంకటేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నిమ్మశెట్టి సత్యం, సీనియర్ నాయకుడు కోనతం పెంటయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.