నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
వెనుకబడిన తరగతులకు చెందిన బిసి మహిళా మంత్రి, పద్మశాలి ముద్దుబిడ్డ కొండా సురేఖ ను మంత్రివర్గం నుండి అర్ధాంతరంగా తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. బిసి సామాజిక వర్గానికి చెందిన మహిళానాయకురాలికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించి ప్రోత్సహించాల్సింది పోయి, ఈ విధంగా పదవి నుంచి భర్తరఫ్ చేయడం వెనుకబడిన వర్గాలను, మహిళా లోకాన్ని, పద్మశాలి వర్గీలను తీవ్రంగా అవమానించడమే అవుతుంది. సమాజంలో సగం ఉన్న మహిళలకు, ముఖ్యంగా బిసి వర్గాల ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వడం ప్రభుత్వాల కనీస ధర్మం. తక్షణమే పార్టీ పెద్దలుఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. లేనిపక్షంలో పద్మశాలి సంఘం తరఫున ధర్నాలు, దీక్షలు చేస్తామని చండూరు పద్మశాలి సంఘం హెచ్చరించారు.