బాసిరాగడి, జ్ఞానాపురంలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
లబ్ధిదారులకు స్వయంగా కార్డులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు గరిసెల సురేందర్ ముదిరాజ్
గుండ్లపోచంపల్లి: (ప్రజా వాణి):- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో బాసిరాగడి, జ్ఞానాపురం గ్రామాల్లో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్డులను పౌర సరఫరాల అధికారి అభిషేక్, రేషన్ షాప్ డీలర్ నాగమణి, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
హాజరైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 299వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్, స్థానిక మాజీ కౌన్సిలర్ మారేపల్లి సుధాకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మరిలమ్మ, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఈ బ్లాక్ అధ్యక్షురాలు కోమలత తదితరులతో కలిసి లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గరిసెల సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్, స్థానిక నాయకులు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.