బాలాజీ ఆలయ ప్రాంగణ పునరుద్ధరణకు భూమిపూజ

పోచారం, సెప్టెంబర్‌ 16 (ప్రజావాణి): శ్రీ వెంకటాపురం క్షేత్రంలోని స్వయంభూ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పాత బండలను తొలగించి నూతన బండలను ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. పోచారం డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్‌, ఆలయ చైర్మన్‌ నీరడి కుమార్‌, బండల దాత, పోచారం డివిజన్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు ముద్దం ఈశ్వర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు, గ్రామ పెద్దలు,...