prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 1:22 pm Digital Edition : PRAJA VANI

బాబా నగర్‌లో ఘనంగా అంబేద్కర్ వినాయకుడి నిమజ్జనం

బాబా నగర్‌లో ఘనంగా అంబేద్కర్ వినాయకుడి నిమజ్జనం

జోగిపేట, సెప్టెంబర్ 25: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలోని 14వ వార్డు న్యూ బాబా నగర్ కాలనీలో అంబేద్కర్ వినాయక సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీ వాసులంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆటపాటల మధ్య గణేశుడిని నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా రాత్రి నిర్వహించిన లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 8 కిలోల బరువున్న మొదటి లడ్డూను ముర్కగల్ల దేవేందర్ రూ.52,500లకు దక్కించుకున్నారు. 2 కిలోల బరువున్న రెండో లడ్డూను జోగ్యల్ల అనుప రూ.23,400లకు దక్కించుకున్నారు.
ప్రతి సంవత్సరం బాబా నగర్ కాలనీలో అంబేద్కర్ వినాయక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలతో పాటు లడ్డూ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో కాలనీ యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.