వినాయక నిమజ్జనం సందర్భంగా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో విద్యుత్ షాక్‌తో మరణించిన కొప్పుల రాజశేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం పరామర్శించారు. రాజశేఖర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి తగిన రీతిలో ఆదుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.