బస్సు – లారీ ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు.

బస్సు - లారీ ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు. ప్రజావాణి ​బయ్యారం,,సెప్టెంబర్ 18. బయ్యారం మండలం ఆలిగేరు బ్రిడ్జి సమీపంలో సత్యనారాయణపురం గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం బస్సు,లారీ ఢీకొన్నాయి.ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎమ్‌టీ సాయిచంద్,పైలట్ అశోక్‌లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రునికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు.