prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 8:19 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంచూరు సూర్యనారాయణ రెడ్డి

బద్వేల్ సెప్టెంబర్ 13 ప్రజావాణి మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకుని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో *టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు ఉమ్మడి కడప జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో, కలిసికట్టుగా పనిచేయాలని శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.నాయకుల ఐకమత్యం.. కార్యకర్తల కృషి.. ప్రజల ఆశీర్వాదంతో బద్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. బద్వేలు మున్సిపాలిటీ ని అన్ని విధాలా అభివృద్ధి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బద్వేలు మున్సిపాలిటీ ప్రజలు రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి పట్టం కట్టడం ఖాయమని తెలిపారు.