బద్వేల్ పోరుమామిళ్ల టు గిద్దలూరు: నిబంధనలు తుంగలో తొక్కి ‘అధిక లోడు’తో ఇసుక దందా

కడప జిల్లా సెప్టెంబర్ 06 ప్రజావాణి బద్వేల్ నుండి పోరుమామిళ్ల వైపు నుంచి ప్రకాశం జిల్లా సరిహద్దులోని కొమ్మురోలు, గిద్దలూరు ప్రాంతాలకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. లారీలు, భారీ టిప్పర్లలో సామర్థ్యానికి మించి, ఏకంగా కొండల్లా ఇసుకను నింపి (ఓవర్‌లోడింగ్) తరలిస్తున్నారు. పచ్చటి పల్లెలు, ప్రధాన రహదారులు ఇసుక లారీల ధూళితో, మితిమీరిన వేగంతో అట్టుడుకుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా , పోలీసు, గనుల శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు...