బద్వేల్ టీడీపీలో ముసలం: రాజీనామా యోచనలో గోపవరం ఎంపీపీ, జడ్పీటీసీ!
వైయస్సార్ జిల్లా బద్వేల్ సెప్టెంబర్ 8 ప్రజావాణి గోపవరం మండలంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.గోపవరం మండలంలో పార్టీ సీనియర్ నాయకులైన ఎంపీపీ జి. ధనలక్ష్మి, జడ్పీటీసీ జయరామిరెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆర్. సూర్యనారాయణ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల తాము తీవ్ర అవమానానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివాదానికి కారణాలు: సమాచారం లేని పార్టీ కార్యక్రమాలు: మండల ప్రథమ పౌరురాలైన ఎంపీపీకి మరియు జడ్పీటీసీ సభ్యునికి కనీస సమాచారం ఇవ్వకుండానే మండలంలో పార్టీ కార్యక్రమాలు,...