ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండానే భూమి ఆన్‌లైన్ మార్పు?బొప్పాపురంలో రెవెన్యూ రికార్డులపై వివాదం.. సమగ్ర విచారణ కోరుతున్న బాధితుడు

కడప జిల్లా పోరుమామిళ్ల,సెప్టెంబర్ 15 ప్రజావాణి పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల రెవెన్యూ రికార్డుల నిర్వహణపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోరుమామిళ్ల మండలం బొప్పాపురం గ్రామంలో 1987లో డీకేటీ పట్టా కింద మంజూరైన భూమికి సంబంధించి ఆన్‌లైన్ రికార్డుల మార్పుపై తీవ్ర వివాదం నెలకొంది. అర్హులైన వారసులందరి అంగీకారం లేకుండా, కనీసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా లేకుండానే భూమిని ఒకరి పేరుపైకి ఆన్‌లైన్ లో మార్చేశారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.బాధితుడు చాటకొండ ఆనందరావు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పాపురం గ్రామంలోని సర్వే నంబర్...